ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మునిగిన పంట...మిగిలిన కన్నీరు ! - water

కృష్ణమ్మ వరదతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా ముంపునకు గురైన పంటలు... కుళ్లిపోయి అన్నదాతలకు కన్నీటిని మిగిల్చాయి

మునిగిన పంట...మిగిలిన కన్నీరు !

By

Published : Aug 21, 2019, 5:39 AM IST

అపార నష్టం...

వరదలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. నాలుగైదు రోజుల పాటు అమరావతి పరిసర గ్రామాలు... వెల్లువలా వచ్చిన నీటితో ఉక్కిరిబిక్కిరయ్యాయి. పెద్దమద్దూరు, నరుకులపాడు, చావపాడు, వైకుంఠపురంతో పాటు చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పత్తి, మిర్చి, పసుపు, కంద పంటలు కుళ్లిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత పొలాలకు వెళ్లిన రైతులు ...పనికి రాకుండా పోయిన పంటలను చూసి బోరున విలపిస్తున్నారు....SPOT

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు...

కృష్ణా జిల్లా లంకల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పంటలు కోల్పోయిన సన్న, చిన్నకారు రైతులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఎకరానికి 15 వేల నుంచి 18 వేల రూపాయలకు కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతులు....కళ్ల ముందే పంట నాశనం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పంట మార్చి వేరే పంట వేస్తే తప్ప మరో మార్గం కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

వరద నష్టం అంచనా...

వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. 33 శాతానికి పైగా నష్టపోయిన పంటను పరిగణనలోనికి తీసుకుంటున్నారు. పరిహారం చెల్లించేందుకు....ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ పుస్తకం, కౌలు రైతులైతే యజమాని అనుమతి పత్రం అవసరమని అధికారులు తెలిపారు.

మునిగిన పంట...మిగిలిన కన్నీరు !

ఇదీచదవండి

వరద బారిన పంట.. ఆవేదనే కనిపిస్తోంది రైతు కంట!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details