గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు... వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4), గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2), ఏఎన్ఎం(గ్రేడ్-3), పశు సంవర్ధక, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులను స్థానిక అవసరాలకు అనుగుణంగా భర్తీ చేస్తారు. మహిళా పోలీసు, ఇంజనీరింగ్ సహాయకుడు, డిజిటల్ సహాయకుడు, గ్రామ సర్వేయర్, సంక్షేమ విద్యా సహాయకుడు పోస్టులన్నీ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు తగినట్లు పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారీ ఈ నియామకాలు జరుగుతాయి. ఇన్ సర్వీస్ ఉద్యోగులకు 10శాతం మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఒప్పంద, పొరుగుసేవల కింద పనిచేస్తూ అదే పోస్టులకు దరఖాస్తు చేసే వారికి ఈ అవకాశం లభిస్తుంది.
వార్డు, గ్రామ సచివాలయాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకు (ఆన్లైన్లో