గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఆర్యవైశ్య విద్యా నిధి కమిటీ సమావేశానికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. 168 మంది పేద విద్యార్థులకు రూ.8 లక్షల విలువైన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. దేవాలయాల భూములను ప్రభుత్వం పంచి వేస్తుందనే దుష్ప్రచారం చేయటం తగదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఈ ఉగాదిలోపు 25 లక్షల పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారని చెప్పారు.
''దుష్ప్రచారం వద్దు.. మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం'' - సీఎం జగన్
దేవాలయాల భూములను ప్రభుత్వం పంచుతోందన్న ప్రచారం.. ప్రతిపక్షానికి సరికాదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
ప్రభుత్వంపై దుష్ర్పచారం...సరికాదని..దేవాదాయ శాఖ మంత్రి