ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చినకాకుమాను గ్రామస్థుల దుస్థితిపై.. హోం మంత్రి స్పందన - canal

ఎన్నో ఏళ్లుగా ఆ గ్రామస్థులు పడుతున్న ఇబ్బందికి పరిష్కారం లభించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాడు సాయంతో కాల్వ దాటుతున్న వారి సమస్యను ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తేవటంతో హోం మంత్రి సుచరిత స్పందించారు. సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తాడుబాట

By

Published : Aug 31, 2019, 6:02 PM IST

గుంటూరు జిల్లా చినకాకుమానులో కాల్వ దాటేందుకు గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. వెంటనే గ్రామస్థులకు బోటు ఏర్పాటు చేయాలని.. నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గ్రామానికి వచ్చిన అధికారులు అక్కడి ప్రజలతో మాట్లాడారు. కాలువ దాటేందుకు వీలుగా త్వరలోనే బోటు అందజేస్తామని తెలిపారు. కొత్త బోటు కొనుగోలుకు 4 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే శాశ్వత పరిష్కారం కోసం వంతెన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని గ్రామస్థులకు తెలిపారు.

తాడే ఆధారం
చినకాకుమాను రైతులకు చెందిన పొలాలు కాలువకు ఆవతలివైపు ఉండటంతో.. వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. జోరుగా ఉన్న నీటి ప్రవాహంలో తాడు సాయంతో కాలువ అవతలికి దాటేందుకు గ్రామస్థులు ప్రాణాలకు తెగించిన వైనాన్ని ఈటీవీ, ఈటీవీ భారత్ వెలుగులోకి తేవటంతో హోం మంత్రి స్పందించారు. తమ బాధలు తీరనున్నందున గ్రామస్థులు హర్షం వెలిబుచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details