ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరులో బాలుడు అదృశ్యం: బెదిరింపా.. కిడ్నాపా?

By

Published : Nov 17, 2020, 3:19 PM IST

గుంటూరులో ఓ బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి డబ్బు ఇస్తేనే చిన్నారిని అప్పగిస్తామని బెదిరించారు. కానీ ఫోన్ కాల్స్ ను పరిశీలించిన పోలీసులకు ఊహించని మలుపులు ఎదురౌతున్నాయి.

boy missing in guntur
గుంటూరులో బాలుడి అదృశ్యం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వినయ్ అనే బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే వెంకటేశ్వర్లు అనే వస్త్ర వ్యాపారి కుమారుడు వినయ్ నిన్నటి నుంచి కనిపించటం లేదు. రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి " మీ అబ్బాయి మా వద్దే ఉన్నాడు. 10 లక్షలు ఇస్తేనే వదిలేస్తాం" అని బెదిరించారు. దీంతో వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం రోజు వినయ్ తన తాత వద్ద ఉన్న సిమ్ కార్డుని అడిగి తీసుకున్నాడు. ఇపుడు ఫోన్ కాల్స్ కూడా అదే నంబర్ నుంచి వస్తుండటంతో... ఇది కిడ్నాపా లేదా బెదిరించటం కోసం ఏమైనా చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా సత్తెనపల్లి పట్టణంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details