ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంగుల ఖర్చును వైకాపా నుంచే రాబట్టాలి: చంద్రబాబు - ఏపీలో రంగుల వివాదం

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికైన ఖర్చును వైకాపా నుంచే వసూలు చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువని ధ్వజమెత్తారు. కొట్టేస్తారని తెలిసి ఇన్ని జీవోలు ఇవ్వటం ఉన్మాదం కాకపోతే ఏమిటని ఆయన ప్రశ్నించారు.

chandra babu
chandra babu

By

Published : Jun 3, 2020, 4:19 PM IST

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన వైకాపా నుంచే... దానికైన మొత్తం ఖర్చును రాబట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు, కోర్టు ధిక్కారానికి, అహంభావానికి వైకాపా ధోరణి ఓ ఉదాహరణ అని ఆయన విమర్శించారు. తాము చేసిందే ఒప్పు అంటూ కోర్టుల్లో పెడ వాదనలు చేసి, తప్పుడు జీవోలు ఇచ్చి... వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయటం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదని ధ్వజమెత్తారు. వైకాపా తప్పులకు ఉన్నతాధికారులు ముగ్గురు కోర్టులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఏడాది పాలనలో వైకాపా నూరు తప్పులు చేసిందని దుయ్యబట్టారు.

కొట్టేస్తారని తెలిసి ఇన్ని జీవోలు ఇవ్వడం ఉన్మాదం కాక మరేంటిని చంద్రబాబు ప్రశ్నించారు. అందరిదీ ఒకదారైతే వైకాపాది మరోదారి.. అదే ‘అడ్డదారి-మాయదారి' అని ఎద్దేవా చేశారు. రంగులపై డబ్బులు వృధా... అడ్వకేట్లకు ఫీజులు వృధా... ఇప్పుడు తొలగించడానికి డబ్బులు వృధా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం వైకాపాకు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details