వరద కష్టాలకు అద్దం పట్టే ఘటన గుంటూరు జిల్లా భట్రిపోలు మండలంలో చోటుచేసుకుంది. చింత మోటు గ్రామానికి చెందిన బి.శకుంతలమ్మ అనే వృద్ధురాలు ఇవాళ మరణించింది. ఆమెను ఖననం చేయడానికి మాత్రం వీలులేకుండా పోయింది. వరద నీటితో చింతమోటు గ్రామ శ్మశానం మునిగిపోయింది. రహదారులు కూడా నీటితో మూసుక మృతదేహం వేరే ప్రాంతాలకు చేసేందుకు తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది. కొల్లూరు తీసుకెళ్లి ఖననం చేసేందుకు సహకరించాలని అధికారులను వృద్ధురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
వరద నీటిలో శ్మశానం... ఖననానికి నోచుకోని మృతదేహం - dead body
అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఖననం చేయడానికి వీలులేకుండా గ్రామ శ్మశానం చుట్టూ నీరు చేరింది. వేరే చోటికి తీసుకెళ్లానన్న రహదారులు మొత్తం మూసుకుపోయాయి. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
వరద నీటిలో శ్మశానం... ఖననానికి నోచుకోని మృతదేహం
Last Updated : Aug 17, 2019, 11:56 AM IST