గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు బాల సాహితి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి పురపాలక సంఘం తరపున నెల రోజులపాటు తరగతులు నిర్వహించనున్నారు. నేటి తరానికి తెలుగు భాష మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు క్లాసులుంటాయని... ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకూ ఈ తరగతుల్లో పాల్గొనవచ్చని వెంకటకృష్ణ తెలిపారు. పద్యాలు, కవితల్లో ప్రతిభ చూపిన వారికి బాల సాహితి పురస్కారం ఇస్తామని పేర్కొన్నారు.
తెనాలిలో 'తెలుగు బాల సాహితి' కార్యక్రమం - తెనాలి
'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్', 'దేశ భాషలందు తెలుగు లెస్స' మరి ఇంతటి పేరున్న తెలుగుపై నేటి తరానికి పూర్తి అవగాహన కల్పించేందుకు తెనాలి పురపాలంక సంఘం నడుం బిగించింది.
తెనాలిలో 'తెలుగు బాల సాహితి' కార్యక్రమం