ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో 'ఖమ్మం బృందం' అరెస్ట్! - TELANAGANA YUVATHA SARVY

స్వాట్ డిజిటల్ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలో సర్వే చేస్తున్న తెలంగాణ యువకులను వైకాపా నేతలు గుర్తించారు. వారిని పోలీసులకు అప్పగించారు. వాళ్ల దగ్గరి నుంచి ఓటర్ల ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లతో ఉన్న పుస్తకాలు, ట్యాబ్​లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రాలో తెలంగాణ యువకులు సర్వే

By

Published : Mar 18, 2019, 1:36 PM IST

ఆంధ్రాలో తెలంగాణ యువకులు సర్వే
స్వాట్ డిజిటల్ పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలో సర్వే చేస్తున్న తెలంగాణ యువకులను వైకాపా నేతలు గుర్తించారు. వారిని పోలీసులకు అప్పగించారు. వాళ్ల దగ్గరి నుంచి ఓటర్ల ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతా నెంబర్లతో ఉన్న పుస్తకాలు, ట్యాబ్​లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలను..బ్యాంకుల నుంచి ఓటర్ల ఖాతాల్లోకి వేశారని పోలీసులకు వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డులు పరిశీలించిన పోలీసులు..ఈ బృందమంతా ఖమ్మం జిల్లా వైరాకు చెందినదిగా గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details