గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థులతో మట్టి పనులు చేయించారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు.. విద్యార్థులను పిలిపించారు. వారికి తట్టలు, పారలు ఇచ్చి మట్టి తవ్వించి మోయించారు.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాద్యాయులే విద్యార్థులతో చాకిరీ చేయించడంపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనకు కారకులైన ఉపాధ్యాయులను తక్షణమే గుర్తించి.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.