గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని 14, 15, 16, 27, 28 వార్డుల్లో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని కోరారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ... ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని సత్యప్రసాద్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన వైకాపా... అన్ని సామాజిక వర్గాల వారికి అన్యాయం చేసిందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు.
రేపల్లెలో పోటాపోటీగా తెదేపా, వైకాపా నేతల ప్రచారం - elections in repalle
పుర ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వైకాపా, తెదేపా నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
మరోవైపు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని 3, 4, 5, 24, 25 వార్డుల్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న మోపిదేవి... తెదేపా హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అసంపూర్తిగా వదిలేసిన ఎన్నో ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని వెల్లడించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.