వైకాపా పాలనలో నిరాశలో ప్రజలు: జీవీ ఆంజనేయులు - వైకాపా
వైకాపా పాలనలో ప్రజలు నిరాశలో ఉన్నారని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షంపై దాడులు చేయడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజాశ్రేయస్సు చేయడంపై లేదన్నారు.
వైకాపా ప్రభుత్వం 40 రోజులపాలన ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టిందని తెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడమై ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.గ్రామాల్లో రాజకీయ దాడులు పెరిగిపోతున్నాయని.... ప్రజలు పల్లెలను విడిచిపోతున్నారని తెలిపారు. రాజధాని అమరావతికి అప్పు ఇవ్వలేమని ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని చెప్పారు.