TDP Protests in AP Over Chandrababu Arrest:చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు (Protests in AP) కొనసాగుతూనే ఉన్నాయి. అధినేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు. బాబును విడుదల చేసేవరకు దీక్షలకు విరామం ప్రకటించే ప్రసక్తే లేదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు.
Protests Continue Against Chandrababu Arrest: ఆగని తెలుగుదేశం నిరసన జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా జనసేన, సీపీఐ నేతలు..
చంద్రబాబు అరెస్టును(Chandrababu Arrest) వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ రైతులు నీళ్లలో దిగి వినూత్న నిరసన తెలిపారు. మంగళగిరిలో శ్రేణులు చేపట్టిన దీక్షలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలోని దీక్షా శిబిరంలో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ జగ్గయ్యపేటలో వినాయకుడి ఆలయంలో హోమం చేశారు. నందిగామలో 13 రోజుల నుంచి కొనసాగుతున్న రిలే దీక్షల్లో తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
CID Two Days interrogation of Chandrababu: సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ సూటిగా, స్పష్టంగా చంద్రబాబు సమాధానం
వైసీపీ రాక్షస పాలనలో అరాచకమే రాజ్యమేలుతోందంటూ ప్రకాశం జిల్లా కనిగిరిలో చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. నెల్లూరులో తెలుగుదేశం శ్రేణులు మహాజ్వాలా లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయాగం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేనేత రాట్నంతో నిరసన తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలంతా మద్దతు తెలపాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పంలో రైళ్లలో కరపత్రాలు పంపిణీ చేశారు. పలమనేరులో టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ల మీద కూర్చుని నిరసన(Protest by sitting on knees) తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ నేత సవితఆమరణ దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రేణులు మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
Bhuvaneshwari Chandrababu Mulakat : చంద్రబాబు ఉక్కుమనిషి.. చిల్లర పనులతో మానసిక క్షోభకు గురిచేయలేరు : భువనేశ్వరి
బాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్ష చేప్టటారు. బాబును విడుదల చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును కుట్ర పన్ని అన్యాయంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. జైల్లో తమ అధినేతకు ఏదైనా హాని జరిగితే జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ కక్షసాధింపు రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఓ వ్యక్తికి న్యాయదేవత వేషం వేసి నిరసన తెలిపారు. చంద్రబాబుకు న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించారు. ముమ్మిడివరంలో చెవిలో పూలు పెట్టుకుని టీడీపీ శ్రేణులు దీక్షల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టీడీపీ శ్రేణులు చెవిలో పూలు పెట్టుకుని, చేతిలో వేపకొమ్మలు ధరించి దీక్షలో పాల్గొన్నారు.
TDP Protests in AP Over Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ఆగని నిరసన జ్వాలలు..