అధికార వికేంద్రీకరణ పేరుతో వికృత ఆలోచనలకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్వస్తి చెప్పాలని.. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని తెదేపా నాయకురాలు, సినీ నటి దివ్యవాణి కోరారు. నిర్మించే వాడే నాయకుడని.. కూల్చేవాడు నాయకుడు కాదని అన్నారు. సోమవారం రాజధాని ఉద్యమం 300 రోజుకు చేరుకున్న క్రమంలో తుళ్లూరులో దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి రైతులు, మహిళలకు సంఘీభావం తెలియజేశారు.
'వికృత ఆలోచనలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి'
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించి.. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని తెదేపా నాయకురాలు దివ్యవాణి డిమాండ్ చేశారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలన్నారు.
రైతులు గెలుస్తారు... అమరావతి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులపై పోరాటానికి ముఖ్యమంత్రి ప్రజల సొమ్మును వెచ్చించి కోర్టులకు వెళ్తున్నారని... రైతులు మాత్రం తమ సొంత సొమ్ములతో న్యాయ పోరాటం చేస్తున్నారని దివ్యవాణి చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించి.. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖలో వేలాది ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రారంభమైందని దివ్యవాణి ఆరోపించారు. తూళ్లూరు ధర్నా శిబిరం వద్ద జానపద కళాకారుడు రమణ బృందం ఆలపించిన పాటకు ఆమె నృత్యం చేసి రైతులు, మహిళలను ఉత్సాహపరిచారు.
ఇదీ చదవండి