ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు'

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి ఉన్న విలువలను కొన్ని రాజకీయ పార్టీలు తుంగలో తొక్కుతున్నాయని తెదేపా నేత నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ 129 వ జయంతిని గుంటూరు వసంతరాయపురంలోని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

tdp nakka ananda babu
రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు: మాజీ మంత్రి నక్కా

By

Published : Apr 14, 2020, 2:10 PM IST

రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు: మాజీ మంత్రి నక్కా

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129 వ జయంతిని.. తెదేపా నేత నక్కా ఆనందబాబు.. గుంటూరు వసంతరాయపురంలోని తన కార్యాలయంలో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగ విలువలను కొన్ని పార్టీలు తుంగలో తొక్కుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాలకోసం ఏర్పడిన పార్టీ తెదేపా అని చెప్పారు. మాస్క్ లు లేవని అడిగిన దళిత వైద్యుడు సుధాకర్ ను అవమానకరంగా సస్పెండ్ చేయడం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details