పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ హైకోర్టులో సోమవారం వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజ్యాంగ, శాసనసభ, మండలి నిబంధనలకు విరుద్ధంగా ఆ చట్టాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిని చట్టాలుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు. ఈ చట్టాలు విభజన చట్టానికి విరుద్ధమన్నారు.
సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్ని మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర సీఎస్, శాసనసభ కార్యదర్శి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖల కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.