ఆత్మకూరు వెళ్లకుండా చేయటంతో పోలీసుల తీరును నిరసిస్తూ ప్రజా ప్రతినిధులంతా ధర్నాకు దిగారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఉండవల్లిలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై బైఠాయించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తమ తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయని, దళితులను రక్షించుకునే బాధ్యత తమపై ఉందని, వారికి అండగా నిలిచేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందిందని, ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నరాని నేతలు విమర్శించారు. నిరసన చేస్తున్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఆత్మకూరుకు వెళ్లకుండా నేతల్ని అడ్డుకున్న పోలీసులు.. - tdp members are arrested by police at vundavali
ఆత్మకూరుకు వెళ్లకుండా తెదేపా నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. దీంతో తెదేపా కార్యకర్తలు ఉండవల్లి రోడ్లపై బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఆత్మకూరుకి వెళ్లకుండా తెదేపా నేతల్ని అరెస్టు చేస్తున్న పోలీసులు
TAGGED:
ఉండవల్లి