ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP leaders on Jagan: తాడేపల్లి ప్యాలెస్​లో 2వేల నోట్లు.. జగన్‌ గుండేల్లో వణుకు: టీడీపీ నేతలు

TDP leaders on Jagan: ఏపీ​లో కనపడని రెండు వేల రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్​లోనే ఉన్నాయని.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా రెండు వేస రూపాయల నోట్లు మార్చడానికి సిద్ధమయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అలానే రెండు వేల నోటు రద్దు చేయడం ఆహ్వానించదగినదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు.

TDP leaders on Jagan
TDP leaders on Jagan

By

Published : May 20, 2023, 6:19 PM IST

TDP leaders on Jagan: ఆర్బీఐ రెండు వేల నోటు ఉపసంహరణ నిర్ణయంపై టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందించారు.. ఈ నిర్ణయంలో వైసీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్​లోనే ఉందని.. ఇప్పుడు వాటిని మార్చడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.

నగదు మార్పిడిలపై నిఘా ఉంచాలి..దేశంలో రెండు వేల నోటు ఉపసంహరణ నిర్ణయం ఆహ్వానించదగినదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. నల్లధనాన్ని అరికట్టడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. రెండు వేల నోటు రద్దు చేయాలని పలు వేదికలపై చంద్రబాబు కోరారని గుర్తు చేసారు. రాష్ట్రంలో కూరగాయలు అమ్మేవారు, చిన్న దుకాణదారులు కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారని వెల్లడించారు. జగన్ రెడ్డి మాత్రం ఇసుక, మద్యం అమ్మకాల్లో నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేసారు. ఇందులో మెజారిటీ నగదు తాడేపల్లి ప్యాలెస్​కు చేరుతోందని ఆరోపించారు.

ఇడుపులపాయ.. నేలమాళిగల్లో రెండు వేల నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం వస్తోందన్నారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి లబ్ధిపొందాలని జగన్ రెడ్డి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గడవులోగా ఏ బ్యాంకుల్లోనైనా పెద్ద ఎత్తున జరిగే నగదు మార్పిడిలపై నిఘా ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. పెద్ద ఎత్తున నగదు మార్పిడి చేసే వారి పట్ల ప్రజలు ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులకు సమాచారం చేరవేయాలని సూచించారు.

తాడేపల్లి ప్యాలెస్​లో వణుకు మొదలైంది..ఆంధ్రప్రదేశ్​లో కనపడని రెండు వేల రూపాయల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్​లోనే ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు వెదజల్లడానికి జగన్ రెండు వేల నోట్లు ప్రతి నియోజకవర్గంలో దాచాడని ఆరోపించారు. మద్యం, ఇసుక, మైనింగ్, అక్రమ భూ లావాదేవీలతో లక్షల కోట్లు జగన్ సంపాదించాడని నిమ్మల దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఏస్టేట్, లోటస్ పాండ్, బెంగళూరు ఎలహంకా నివాసాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఆక్షేపించారు.

కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్​లో రెండు వేల రూపాయల నోట్లు మార్పిడిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు జగన్ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా రెండు వేల రూపాయల నోట్లు మార్చడానికి సిద్ధమయ్యారని సమాచారం ఉందన్నారు. ఆర్బీఐ నిర్ణయంతో తాడేపల్లి ప్యాలెస్​లో వణుకు మొదలైందని మండిపడ్డారు. తను మూడు సంవత్సరాలు నుంచి రెండు వేల నోటు చూడలేదని తెలిపారు.

నిన్న ఆర్బీఐ రెండు వేల నోట్లు రద్దు అని చెప్పినప్పుటి నుంచి తాడేపల్లి ప్యాలెస్​ గజగజలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూజా రెండు వేల రూపాయల నోట్లు ఏపీలో ఏమయ్యాయి.. ఏక్కడ మార్పిడి చేస్తున్నారు.. అనే విషయంపై నిఘా కేంద్రాలు పెట్టాలి.- నిమ్మల రామానాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

తాడేపల్లి ప్యాలెస్​లో 2వేల నోట్లు.. జగన్‌ గుండేల్లో వణుకు: టీడీపీ నేతలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details