TDP leaders meet the Governor: వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. కల్పించుకోవాలంటూ.. టీడీపీ గవర్నర్‌కు ఫిర్యాదు TDP leaders meet the Governor: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంతో పాటుగా... రాష్ట్రంలో పరిణామాలను వివరించేందుకు తెలుగుదేశం నేతలు బుధవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలిశారు. న్యాయస్థానాల్లో 17Aపై కీలక వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్‌తో తెలుగుదేశం నేతల భేటీ.. చర్చనీయాంశంగా మారింది. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని తెలుగుదేశం నేతలు... గవర్నర్‌కు వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ నిర్బంధాలపైనా గవర్నర్(Governor) దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.
TDP Leaders to Meet Governor: రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్ ఆరా..! టీడీపీ నేతలకు అపాయింట్మెంట్
సీఐడీ, పోలీస్ వ్యవస్థలతో...రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 8మంది సభ్యుల తెలుగుదేశం బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేసింది. 17Aపైసుప్రీంకోర్ట్ (Supreme Court) లో కీలక వాదనలుజరిగిన క్రమంలో గవర్నరుతో తెలుగుదేశం నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ, పోలీస్ వ్యవస్థలను అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. స్కిల్, ఫైబర్ నెట్, ఐఆర్ఆర్ ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవాలు అంటూ నేతలు గవర్నర్ కు పుస్తకాలు అందజేశారు. గత నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై తెలుగుదేశం నేతలు గవర్నర్ కు సమగ్ర నివేదిక అందించారు. వైసీపీ(YCP) ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగం అమలు లేకుండా చేసిందని నేతలు ధ్వజమెత్తారు. గవర్నర్ ను కలిసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
TDP Leaders Meet Governor : 'చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారేమో..!' గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతల బృందం
స్కిల్ కేసు..రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా భ్రష్టు పట్టించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని టీడీపీ(TDP) నేతలు వెల్లడించారు. చంద్రబాబును ఎలాంటి ఆధారం లేకుండా అక్రమ కేసులో అరెస్ట్ చేశారని తెలిపారు. గత 40రోజులుగా రాజమండ్రి జైల్లో ఎలా నిర్బంధించిందీ గవర్నర్ కి వివరించామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలపై నివేదికను కేంద్రానికి పంపాలని గవర్నర్ ని కోరితే సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతలు తెలిపారు. స్కిల్ కేసు(skill case) మొదటి నుంచి తనకు తెలుసునని, కోర్టు పరిధిలో ఉన్న అంశం ఇప్పుడు మాట్లాడటం సబబు కాదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తన నుంచి మొదలైన అక్రమ కేసులు చంద్రబాబు వరకూ కొనసాగాయని అచ్చెన్న తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అసాంఘిక కార్యక్రమాలను రాజ్యాంగ పెద్ద కాపాడాల్సి ఉందని నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు(Fundamental rights), ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలని కోరామని తెలిపారు. చట్టాలను గౌరవించకుండా అతిక్రమించి నడుపుతున్నారు కాబట్టి మీ పరిధిలో ఉన్న చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. గవర్నర్‌ను కలవనున్న వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారు.
Janasena Leaders Meeting with AP Governor Abdul Nazeer: గవర్నర్‌ను కలిసిన జనసేన నేతలు.. వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు