రాజకీయ దాడులు అరికట్టడంలో పోలీసులు విఫలమైనట్లు మాజీ మంత్రులు ఆరోపించారు. ఎక్కడెక్కడ దాడులు జరిగాయో... కేసులతో ఎలా వేధిస్తున్నారనే...వివరాలను గ్రామీణ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. 'పల్నాడును రక్షించండి... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి' నినాదంతో తాము పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని ఎస్పీకి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపైనా పోలీసుల వైఖరిని నేతలు తప్పుబట్టారు. తెదేపా కార్యకర్తలపై వెంటనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు... వైకాపా కార్యకర్తలపై తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు గడుస్తున్నా...ఇంకా దాడులు జరగటం సరికాదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అభిప్రాయపడ్డారు.
దాడులపై ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదు! - వైకాపా
రాజకీయ దాడులు అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై తెదేపా నేతలు ఎస్పీ జయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు.
![దాడులపై ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4248784-123-4248784-1566825897627.jpg)
దాడులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు!
దాడులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు!
ఇదీ చదవండి: 'ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర'