ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో తెదేపా నేతల అరెస్ట్ - tdp leaders arrest at guntur

'చలో ఆత్మకూరు' కార్యక్రమం నేపథ్యంలో తెదేపా నేతల గృహ నిర్బంధాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.

తెదేపా నేతల అరెస్ట్

By

Published : Sep 11, 2019, 9:49 AM IST

Updated : Sep 11, 2019, 9:55 AM IST

తెదేపా నేతల అరెస్ట్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి నుంచి 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు జిల్లాలో ' చలో ఆత్మకూరు'కు బయల్దేరిన తెదేపా నేతలను గృహ నిర్బంధం చేశారు. నక్కా ఆనంద్‌బాబు, యరపతినేని శ్రీనివాసరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్రలను గృహ నిర్బంధం చేశారు. తెదేపా నేతల అరెస్టును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డగించి, రోడ్డుపై బైఠాయించారు.
తెదేపా నేతల అరెస్ట్

నరసారావుపేటలో చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లకుండా తెదేపా నాయకుడు చదలవాడ అరవింద బాబును గృహ నిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరవిందబాబు ఇంటి చుట్టూ మోహరించారు.

పోలీసుల వైఖరిని తెదేపా నేతలు తప్పుపడుతున్నారు. తమ పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : పల్నాడు పోరు.. చంద్రబాబు గృహ నిర్బంధం

Last Updated : Sep 11, 2019, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details