ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Leaders Allegations Against YCP Government: వైసీపీ చర్యలకు త్వరలోనే ప్రతి చర్యలుంటాయి.. తప్పుడు ఆడిట్ రిపోర్టుతో కుట్ర చేస్తారా! : టీడీపీ - రోజా కామెంట్స్ ఆన్ చంద్రబాబు

TDP Leaders Allegations Against YCP Government: చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై త్వరలో ప్రతి చర్యలు తప్పవని.. టీడీపీ నేతలు హెచ్చరించారు. కేవలం కక్ష సాధింపులోక భాగంగానే జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్న విషయం బహిరంగ రహస్యమేనని వారు మండిపడ్డారు. తప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతో పన్నిన కుట్ర నుంచి త్వరలోనే చంద్రబాబు బయటపడతారని ప్రకటించారు.

TDP leaders allegations against YCP government
TDP leaders allegations against YCP government

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 9:29 PM IST

Updated : Oct 16, 2023, 7:05 AM IST

TDP Leaders Allegations Against YCP Government: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో పెట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్, చేసిన ఆరోపణలు దేనికీకూడా నేటికి ఒక్క ఆధారం చూపలేకపోయారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా ఉంచి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చిన్న అవినీతికి కూడా తావు లేకుండా కొన్ని లక్షల మంది జీవితాలు బాగు చేసింది ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అని గుర్తుచేశారు. ఎక్కడా కూడా ఫిజికల్ గా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్ని తాము పరిశీలించలేదని శరత్ అసోసియేట్ వారే చెప్పారని పట్టాభి తెలిపారు. తప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతోనే కుట్రకు తెరలేపారని దుయ్యబట్టారు.

Chandrababu Family Members Worried About His Health: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అందరిలో ఆందోళన.. ప్రభుత్వంపై ఆగ్రహం

వంగలపూడి అనిత చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావం తప్పకుండా తెలంగాణ ఎన్నికల పై ఉంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును సమర్థించిన వారికి ఎన్నికల్లో నష్టం తప్పదన్నారు. కేసీఆర్, జగన్ లది దృఢమైన బంధం అన్నారు.జగన్ కి బ్లాక్ కలర్ ఫోబియా ఉందని అన్నారు. 16 నెలలు జగన్ ఉన్న జగన్ కక్ష కట్టి బాబును జైల్ లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు సిఎం సీటు, ఎంపి సీటుకు అడ్డువస్తారని బాబాయినే హత్య చేశారని అన్నారు. పరదాలు మాటున తిరిగే సిఎం జగన్..చంద్రబాబు,లోకేష్, పవన్ ను తిట్టడం హాస్య స్పదంగా ఉందని అన్నారు.

Inauguration of CM Camp Office on Rushikonda October 19th: 19న రుషికొండపై జగన్ కుటుంబసభ్యుల పూజలు?

అశోక్ బాబు రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం, జైళ్లశాఖ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని... తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. జైళ్లశాఖ డీజీఐ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జైలు అధికారులు హెల్త్ రిపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత విస్మరించారని విమర్శించారు. 74 ఏళ్ల చంద్రబాబు డీహైడ్రేషన్, ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని..., పూర్తిగా బాడీ చెకప్ చేయించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టంచేశారు.

జలీల్ ఖాన్ చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు నిరసనగా... సంకెళ్లు వేసుకొని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వినూత్న నిరసన తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడిపై వైసీపీ సైకో ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. వైసీపీ నేతలు చేసే ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం కక్ష సాధింపు విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. నిరంతరం అభివృద్ధి కోరుకునే చంద్రబాబు.. ఏనాడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు.

TDP Nyayaniki Sankellu Program: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఈ రోజు రాత్రి టీడీపీ 'న్యాయానికి సంకెళ్లు'

Last Updated : Oct 16, 2023, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details