గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. పల్నాడు జిల్లా సాధన కమిటీ పిడుగురాళ్లలో మహార్యాలీ నిర్వహించింది. రాల్యీలో పాల్గొన్న తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలు చేస్తామన్న సీఎం జగన్.. రాజంపేట, హిందూపురాన్ని ఎందుకు జిల్లాలు చేయలేదని ప్రశ్నించారు.
అవసరమైనచోట ఇష్టమొచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారని యరపతినేని మండిపడ్డారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడమనేది భిక్ష కాదని.. అది ప్రజల హక్కు అని అన్నారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేసేవరకూ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.