గుంటూరు జిల్లా వినుకొండలోని సురేశ్ మహల్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు తెదేపా తరఫున పోరాడతామని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇందుకోసం అఖిలపక్షాలతో కలిసి ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ.. రెండు రోజుల క్రితం అధికార యంత్రాంగంతో కలిసి నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ తొలగించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించడమే కాక, స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీస్, రెవిన్యూ, విద్యుత్ శాఖల అధికారులను తప్పుదోవ పట్టించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడిన కమిషనర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే కమిషనర్ని విధుల నుంచి తొలగించి.. నివాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని అన్నారు.
ఇదీ చదవండి: