ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాసేపట్లో చంద్రబాబును కలవనున్న తెదేపా కాపు నేతలు - babu

తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసానికి తెదేపా కాపు నేతలు చేరుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కాపు నేతలు ఓటమిపై విశ్లేషించుకునేందుకు కాకినాడలో సమావేశమయ్యామని మాజీ ఎమ్మెల్యే బోండా తెలిపారు.

tdp-kapu-leaders-meeting

By

Published : Jul 1, 2019, 4:19 PM IST

చంద్రబాబును కలవనున్న తెదేపా కాపు నేతలు

పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని బోండా ఉమా ఖండించారు. సాయంత్రం తమ అధినేత చంద్రబాబును కలిసి కాకినాడ సమావేశంపై అలాగే ఎన్నికల్లో ఓటమిపై కారణాలు విశ్లేషిస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చే నిర్వహించామని స్పష్టం చేశారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తూ వైకాపా నాయకులు తిరిగి తెదేపా నేతలపై డిజిపిని కలవడం దారుణం అన్నారు. పార్టీ పటిష్టత భవిష్యత్తులో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై తెదేపా కాపు నాయకుల సమావేశంలో చర్చించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details