గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం రాష్ట్రంలో తెదేపా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రచార పత్రంవిడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్ష నేత జగన్ దిగజారుడు పనులు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే జగన్ కు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదన్నారు.ఇన్ని రోజులు పార్టీలో కొనసాగిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి...బయటకు వెళ్లాక తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు.