ఎన్నికలకు తెదేపా సర్వ సన్నద్ధమైంది. ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 25 లోక్‌సభ స్థానాలకు రెండువారాలపాటు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏకాభిప్రాయం వచ్చిన స్థానాలను ఖరారు చేశారు. వివాదాలు ఉన్న స్థానాలను పెండింగ్‌లో ఉంచిన ముఖ్యమంత్రి... ఆయా స్థానాల నేతలను పిలిపించి మాట్లాడారు.వివాదాల పరిష్కారానికి యనమల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా సుజనా చౌదరి, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యని ఎంపిక చేశారు. ఈనెల 12 లేదా 13న తెదేపా అసెంబ్లీ అభ్యర్థుల తొలిజాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ప్రణాళిక విడుదల అయిన నేపథ్యంలో...ముఖ్యమంత్రి చంద్రబాబుజిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు.
ఇవీ చదవండి...