"వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు" - attacks
వైకాపా నాయకుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తెదేపా నేత కొల్లా వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపాపై విమర్శలు మానుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు.
వైకాపా నాయకుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని.... గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన సంగం డెయిరీ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు కొల్లా వీరయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పత్రికల్లో ప్రకటనలు ఎందుకు ఇచ్చావని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ప్రకటనలు ఇవ్వడం ఆపాలని, లేదంటే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారని వీరయ్యచౌదరి వాపోయారు. తనపై దాడి చేసే అవకాశాలున్నాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.