TENSION AT DGP OFFICE : డీజీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత, మహిళలు డీజీపీని కలిసేందుకు వెళ్లారు. అనుమతి లేదని ఆచంట సునితను, తెలుగుదేశం మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం తర్వాత ఆచంట సునితను మరొకరిని మాత్రమే పోలీసులు అనుమతించారు. అంగన్వాడి టీచర్లు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లపై పోలీసుల వేధింపులు ఆపకపోతే పార్టీ తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు - టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత
TENSION AT DGP OFFICE : డీజీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడీ టీచర్లపై పోలీసులు వేధిస్తున్నారని డీజీపీని కలిసేందుకు టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత, మహిళలు వెళ్లగా పోలీసులు అనుమతి నిరాకరించారు.
TENSION AT DGP OFFICE