గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారు వ్యాపారి సాంబశివరావు.. అదే ప్రాంతానికి చెందిన చక్రవర్తి వద్ద నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.పన్నెండు లక్షలు తీసుకున్నాడు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సాయంత్రం సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని బంగారు వ్యాపారులు చక్రవర్తి, మోహన్, మధు అనే వ్యక్తులే తమ తండ్రి మృతికి కారణమంటూ అతని పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస రెడ్డి చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో బంగారం వ్యాపారి మృతి - గుంటూరు జిల్లా మంగళగిరిలో వ్యాపారి మృతి
గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు వ్యాపారి వెనిగళ్ల సాంబశివరావు అనే వ్యక్తి.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంగారం వ్యాపారి అనుమానాస్పద మృతి