అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో జరిగింది. పెనుమూడి గ్రామ సమీపంలోని పుష్కర ఘాట్ వద్ద చలనం లేకుండా పడి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన టి. నాగేంద్రయ్య(63) గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి.. కేసు నమోదు - వేమూరు మండలం
గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతిచెందాడు. పెనుమూడి గ్రామ సమీపంలోని పుష్కర ఘాట్ వద్ద చలనం లేకుండా పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతను మృతి చెందినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి