ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మృతులకు పరిహారంపై సుప్రీం కీలక ఆదేశాలు... - sc judgement on corona deaths

compensation for Corona deaths: కరోనా బాధితులకు పరిహారం చెల్లింపుపై ఏపీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.50 వేలు చెల్లించాలని గతంలో ఆదేశించినా ఆ ఆదేశాలు అమలు కావడం లేదంటూ.. ఇంకా 7 వేలమంది బాధితులకు పరిహారం చెల్లించలేదంటూ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు వేసిన పిటీషన్ వేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని చేర్చారు.

సుప్రీం
compensation for Corona deaths

By

Published : Apr 10, 2023, 5:31 PM IST

అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం. గత ఏడాది మే 27, 2022 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. అందుకు సంబంధించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించినట్లు తెలిపింది.

compensation for Corona deaths: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కరోనా నేపథ్యంలో చనిపోయిన కుటుంబాలకు చెల్లించే పరిహారం విషయంలో సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని ఏపీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కరోనా మృతుల కుంటంబాలకు రూ.50 వేలు చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదని పల్లా శ్రీనివాసరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇంకా 7 వేలమంది బాధితులకు పరిహారం చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వం తరుపున ప్రతివాదిగా ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని చేర్చారు. పరిహారం చెల్లింపుపై గ్రీవెన్స్‌ సెల్‌కి వెళ్లాలనిసుప్రీంకోర్టు పల్లా శ్రీనివాసరావు సూచించింది. అప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే ఏపీ లీగల్‌ సర్వీస్‌ అథారిటీని ఆశ్రయించవచ్చని ధర్మాసనం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ విపత్తు సహాయనిధి నుంచి చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికంగా మృతులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ మెరకు గతంలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది.

26, జులై, 2022న రాసిన లేఖ ప్రకారం: కొవిడ్‌ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఇంకా ఎంత మందికి చెల్లించారు? వీటిలో ఎన్ని క్లైమ్స్ తిరస్కరించారు అని రామ్మోహన్​నాయుడు ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 26, జులై, 2022న రాసిన లేఖ ప్రకారం... ఏపీ నుంచి పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చినట్లు అప్పట్లో పేర్కొంది. వాటిలో సుమారు 47,228 క్లెయిమ్స్‌ను ప్రభుత్వం ఆమోదించినట్లు పేర్కొంది. అందు కోసం ఒక్కొ మృతుడు కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఇందులో 3,171 దరఖాస్తులను తిరస్కరించినట్లు ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. ఇదే అంశంపై టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వచ్చిన క్లెయిమ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే సుమారు 7 వేలమంది బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details