ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్యకు కుట్ర.. బాపట్లలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్ - bapatla crime news

బాపట్ల పోలీసులు హత్య ప్రణాళికను భగ్నం చేశారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వచ్చిన తేడాలు గొడవకు దారీ తీశాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని అంతం చేయాలని కుట్ర పన్నాడు. అందుకోసం ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పక్కా సమాచారంతో ఆ గ్యాంగ్ ఉన్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

bapatla supari gang arrest
బాపట్లలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

By

Published : Apr 19, 2021, 6:07 AM IST

గుంటూరు జిల్లా బాపట్లలో సుపారీ గ్యాంగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. జిలానీ అనే వ్యక్తిని హత్య చేసేందుకు మూకిరి రాజా అనే మరో వ్యక్తి ఆ ముఠాని రప్పించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం వచ్చిన కారణంగా... పక్కా ప్రణాళికతో శీలం వారి వీధిలో కిరాయి ముఠా ఉన్న ఇంటిపై దాడి చేసినట్టు చెప్పారు. జిలానీ, రాజా గతంలో స్నేహితులనీ.. ఆర్థిక వ్యవహారాల్లో తేడా వచ్చి విడిపోయారని అన్నారు.

కొద్ది నెలల క్రితం రాజాపై దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు జిలానీని అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై జిలానీ బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న రాజా... జిలానీని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం భారీ మొత్తంలో నగదు ఇచ్చి.. ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే రాజా కదలికలపై కన్నేసి అతడు చేసిన కుట్రను ఛేదించాం.. అని బాపట్ల పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details