కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన - midday meals
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పథకాన్ని కొనసాగించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిని కేవలం పథకంలా మాత్రమే చూడకుండా... అక్షరాస్యతను పెంచే అంశంలా పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి భగవాన్ దాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని.. వీరికి మధ్యాహ్న భోజనం నిలిపివేయటం సరికాదన్నారు. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూ విద్యానభ్యసించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.