రేషన్ పంపిణీకి వేలిముద్రను తప్పనిసరి చేయడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వేలిముద్రలు వేయాలనటం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. దీనివల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వేలిముద్రల విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కావాలంటే అమలు చేయవచ్చని సూచించారు.
'కరోనా సమయంలో... వేలిముద్రలు ఎందుకు..?'
రాష్ట్రంలో బుధవారం నుంచి మూడో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. అయితే నిత్యావసరాలు పొందేందుకు వేలిముద్రను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించడాన్ని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు.
kanna letter to cm jagan