Stone lifting competitions: గుంటూరు జిల్లా పిరంగీపురం మండలం వేములూరి పాడు గ్రామంలో సంక్రాంతి పురస్కరించుకుని 102 కేజీల గుండు రాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలో పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడి పాడుకు చెందిన ముగ్గురు సత్తా చాటారు. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.
గుంటూరులో సరదాగా సాగిన గుండు ఎత్తే పోటీలు - సంక్రాతికి రాళ్లు ఎత్తే పోటీలు
Stone lifting competitions: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా కోళ్ల పందేలు, గుండాటలు నిర్వహించటతో పాటు అలాగే పేకాట కూడా ఆడతారు. అంతే కాకుండా సంక్రాంతి పండగని పురస్కరించుకొని.. గుంటూరు జిల్లా పిరంగీపురం మండలం వేములూరి పాడు గ్రామంలో 102 కేజీల గుండు రాయి ఎత్తే పోటీలు నిర్వహించారు.
గుండు రాయి ఎత్తే పోటీలు
పోటీలో భాగంగా 5 నిమిషాల సమయంలోనే పమిడి పాడుకు చెందిన మద్దం వీరంజనేయులు 36 సార్లు గుండును ఎత్తి కింద పడేసి ప్రథమ స్థానంలో నిలవగా, మేకల నరేంద్ర 22 సార్లు, ఆత్మ కూరి నాగరాజు 12 సార్లు గుండు రాయిని పైకి ఎత్తి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.5,116లు, రెండో బహుమతి రూ.3,116లు, మూడో బహుమతి రూ.2,116లు అందించారు. పోటీలు తిలకించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇవీ చదవండి: