Stepfather killed His Daughter: స్నేహితుడితో అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడుతోందన్న కోపంతో ఓ సవతి తండ్రి తన కుమార్తెను హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో సాదిక్ అనే సవతి తండ్రి తన 17 ఏళ్ల కుమార్తెను ఆదివారం గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని.. గొంతు నులిమి కుమార్తె హత్య - ఆంధ్రప్రదేశ్ వార్తలు
Stepfather killed His Daughter: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తరచుగా తన కూతురు ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందనే కోపంతో ఓ సవతి తండ్రి ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
గొంతు నులిమి కుమార్తె హత్య