శ్రీరాముడి అండతో ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగేంత వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని మహిళలు తేల్చిచెప్పారు. మందడం దీక్ష శిబిరంలో రైతులు, మహిళలు శ్రీరాముడికి పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. నీరుకొండ, పెదపరిమి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ఇంటి వద్దే నిరసన దీక్షలు చేపట్టారు. నేటితో వారందరి దీక్షలు 107వ రోజుకు చేరాయి.
107వ రోజుకు అమరావతి ఆందోళనలు.. సీతారాములకు పూజలు - latest news of amaravathi farmers
రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు.. 107వ రోజుకు చేరాయి. శిబిరంలో సీతారాములకు పూజలు చేసి అమరావతి కోసం... ప్రార్థించారు. తమకు ఆ రాముడి అండ ఉంటుందని రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు.
107వ రోజు శ్రీరాముడికి పూజలు చేసి దీక్ష చేసిన రాజధాని రైతులు