ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కరాలకు తవ్వారు... ఇప్పటికీ అలానే వదిలేశారు

కళ్లలోకి దుమ్ము... కాళ్లలోకి రాళ్లు.... బండి నడపాలంటే గోతులు.... నడిచి వెళ్లాలంటే నానా అవస్థలు... ఇది గుంటూరు నగరంలోని ఓ రోడ్డు పరిస్థితి. జిల్లా కేంద్రం నుంచి ఐదు నియోజకవర్గాలకు వెళ్లే రహదారి గత నాలుగేళ్లుగా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గుంటూరు నుంచి తెనాలి వెళ్లే మార్గం దాదాపు 3 కిలోమీటర్ల మేర అధ్వాన్న స్థితిలో ఉన్న రోడ్డుపై ఈటీవి భారత్ స్పెషల్ ఫోకస్...

రోడ్డు

By

Published : Jul 3, 2019, 1:17 AM IST

జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించే ప్రధాన రోడ్డు వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. తెనాలి, పొన్నూరు, రేపల్లె, బాపట్ట, వేమూరు.. ఈ ఐదు నియోజకవర్గాల ప్రజలు ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డు గులకరాళ్లతో నిండిపోయింది. అభివృద్ధి పేరుతో పాత రోడ్డును తొలగించిన అధికారులు కొత్త రోడ్డును వేయకుండా అలాగే వదిలేశారు. గుంతలు, గులకరాళ్లు, రోడ్డు మధ్యలో స్తంభాలు, మ్యాన్​హోల్స్, ఒకే వైపున రాకపోకలు ఇలా సమస్యలతో నిండి ఉంది ఆ రోడ్డు. పుష్కరాల సమయంలో రోడ్డును తవ్వి... మూడేళ్లుగా అలాగే వదిలేశారు. ఈ రోడ్డున రావాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవతున్నామని.. వెంటనే కొత్త రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.

పుష్కరాలకు తవ్వారు... ఇప్పటికీ అలానే వదిలేశారు

ABOUT THE AUTHOR

...view details