ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Somu On Jagan Govt: ఏపీ భాజపా తరపున.. సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం: సోము వీర్రాజు - సోము వీర్రాజు న్యూస్

Somu Veerraju On YSRCP Govt: ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరు కాకుండా.. తన పేరు వేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జగన్ తన పేరు పెట్టుకోవటం ఏంటని ప్రశ్నించారు.

ఏపీ భాజపా తరపున సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం
ఏపీ భాజపా తరపున సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం

By

Published : Dec 5, 2021, 4:05 PM IST

ఏపీ భాజపా తరపున సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం

Somu On Jagan Govt Over Schemes Names: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు.. ముఖ్యమంత్రి జగన్ తన పేరు పెట్టుకోవటం ఏంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 36 పథకాలకు కేంద్రం సాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సైతం ప్రధాని పేరు కాకుండా.. తన పేరు వేసుకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు.

రాష్ట్రంలో పేదలకు 15 లక్షల ఇళ్లు కేటాయించామని.. వీటికి కూడా జగన్ తన పేరును తగిలించుకున్నారని ధ్వజమెత్తారు. ఇందుకుగానూ.. ఏపీ భాజపా తరపున సీఎం జగన్​కు డబుల్ స్టిక్కర్, ట్రిపుల్ స్టిక్కర్ అని పేరు పెడుతున్నామని అన్నారు. గుంటూరులో రాజ్యాంగ ఆమోద ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీలో కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సోము వీర్రాజు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details