ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికీ స్మార్ట్‌ ఫోన్‌ - గురుకులాల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్ తరగతుల నిర్వహణ దృష్ట్యా 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Smart phone for every student studying in Gurukul in ap
Smart phone for every student studying in Gurukul in ap

By

Published : Jun 6, 2020, 7:11 AM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడినందున 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.6 వేల విలువగల స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ నిర్ణయించింది. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో 30-40 శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర విద్యార్థులకు ఎలాంటి ఆటంకాల్లేకుండా బోధన అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. శుక్రవారం తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  • ముఖ్యమైన నిర్ణయాలివి
    నెలకు ఒక్కో పాఠశాలకు 300 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌, 150 లీటర్ల సబ్బు ద్రావణం సరఫరా.
    189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల ఏర్పాటు
    * విశాఖపట్నంలో 2, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
    * విద్యార్థులకు ఆహారం తయారీ, క్యాటరింగ్‌ను పొరుగుసేవల విధానంలో అప్పగించాలి.
    * కొత్తగా 34 గురుకులాల్లో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి.
    * పరిశుభ్రత, పచ్చదనంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తొలిస్థానంలో నిలిచిన గురుకులానికి రూ.50 వేలు, ద్వితీయ స్థానానికి రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి.

ABOUT THE AUTHOR

...view details