మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన షరీఫ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్ నాయకుడు, ఎం.ఎ.షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు షరీఫ్ మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్ నాయకుడు,ఎం.ఎ.షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శాసనమండలి ఛైర్మన్ పదవికి బుధవారం నామినేషన్లు స్వీకరించగా...ఎం.ఎ.షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.ఈ రోజు ఉదయం11.30గంటలకు షరీఫ్ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు.వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు.శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్.ఎండి.ఫరూక్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీగా ఉంది.మండలి ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నోటిఫికేషన్ జారీ చేశారు.