ఎస్సీ వర్గీకరణ కోరుతూ రేపు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలు చేస్తున్నారు. మంగళగిరి, తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆందోళకారులను అడ్డుకునేందుకు పోలీసులు అధికసంఖ్యలో బందోబస్తు నిర్వహించనున్నారు.
రేపు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపు.. 144 సెక్షన్ విధింపు - police
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు
Section 144 has been imposed by police in the Amravati area of the capital.