సచివాలయంలో పనిచేసే పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికులు మూడో బ్లాక్ లో సమావేశమయ్యారు. తమను నియమించిన కాంట్రాక్టర్ 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని.... ఫలితంగా ఇళ్లు గడవని పరిస్ధితుల్లో కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. వేతనాలు చెల్లించాలని పలుమార్లు కోరినా స్పందించడం లేదని తెలిపారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని వెంటనే తమకు జీతం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
'సీఎం గారూ.. జీతాలు ఇప్పించండి' - house keeping labours
సచివాలయంలో పనిచేసే పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాలు చెల్లించేలా సీఎం ఆదేశించాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులు