గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సైన్యం దాడి చేసి... ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినందుకు ఈ ర్యాలీని చేశారు. విద్యార్థులంతా జాతీయ జెండాలు పట్టుకుని జయహో భారత్.. జై జై జవాన్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి జై అంటూ నినాదాలు చేశారు. నరసరావుపేట సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. పుల్వామాలో సైనికులపై దాడికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ అన్నారు. దేశంలో ఉగ్రవాదులకు చోటులేదన్నారు.
'జై జవాన్' - guntur
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు ప్రాంతాల్లో భారత గగనతల రక్షణ సైన్యం దాడి చేసి... ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి.. విజయవంతంగా వచ్చినందకు మద్దతుగా... గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ పాఠశాల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.
మోడరన్ పాఠశాల విద్యార్థులు