సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి సభాపతి కోడెల శివప్రసాదరావు... అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇరువురు పోటీపడగా సభాపతి కోడెల 1000 లోపు ఓట్లతో గెలుపొంది రెండోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నెల 22న సభాపతి కోడెల నామినేషన్ దాఖలు చేస్తుండగా, 23వ తేదీ వైసీపీ నుంచి అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ సమయంలో తమ బలాలను నిరూపించుకునేందుకు కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే అదనంగా 15 వేల మెజార్టీ తెచ్చుకోవాలని సభాపతి వ్యూహరచన చేస్తుంటే... ఈసారి ఎలాగైనా 20 వేల మెజారిటీతో గెలవాలని వైసీపీ అభ్యర్థి రాంబాబు వ్యూహాలు రచిస్తున్నారు. నామినేషన్కుముందే అభ్యర్థులు ప్రచార హోరు సాగిస్తూ వ్యూహప్రతివ్యూహాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు.