ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sarpanch's Protest: నిధులు విడుదల చేయాలని రోడ్డెక్కిన సర్పంచులు - గుంటూరులో తమ డిమాండ్ల కోసం సర్పంచ్‌ల నిరసన

Sarpanch's protest: గ్రామ పంచాయతీలకు నిధులు రాక సర్పంచులు సతమతమవుతున్నారు. దీనివల్ల గ్రామంలో సర్పంచులకు కనీస గౌరవం దక్కటం లేదంటూ గుంటూరులో సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. గుండు చేయించుకుంటే మూడు నెలల్లో మళ్లీ వెంట్రుకలు వస్తాయి... కానీ ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయన్న నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.

Sarpanches
Sarpanches

By

Published : May 6, 2023, 5:13 PM IST

గుంటూరులో సర్పంచుల ఆందోళన

Sarpanch's Protest : పల్లెను ప్రగతి బాటలో నడిపించి, గ్రామ పెద్దగా ఉండి అన్ని వేళలా ముందుండి ఊరి ప్రజల క్షేమం కోరేవాడు సర్పంచ్... గ్రామంలో ఏ సమస్య వచ్చినా తన ఇంటి సమస్యగా భావించి, తీర్చేవాడు.. అలాంటి గ్రామ ప్రథమ పౌరుడికి జగన్ పాలన ఫలితంగా గ్రామంలో సర్పంచ్​లు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి పనిచేసిన సర్పంచులకు ఇప్పుడు దీన పరిస్థితి ఎదురైంది. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం చేసిన పనులకు ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక, చేసిన అప్పులు తీరక ప్రస్తుతం సర్పంచులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి సర్పంచులకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని గుంటూరులో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

సర్పంచులకు ఏ రోజు కూడా గౌరవం దక్కటం లేదు:వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు కనీస గౌరవం దక్కటం లేదంటూ గుంటూరులో సర్పంచులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం కొరిటపాడు నుంచి అంబేడ్కర్ కూడలి వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద అరగుండు కొట్టించుకుని సర్పంచులు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని ఆరోపించారు. కనీసం ఉత్సవ విగ్రహాలైనా ఏడాదికోసారి పూజలు అందుకుంటాయని... కానీ సర్పంచులకు ఏ రోజు కూడా గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండు చేయించుకుంటే మూడు నెలల్లో మళ్లీ వెంట్రుకలు వస్తాయి... కానీ ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయన్న నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.

రోడ్డెక్కిన సర్పంచులు:గుంటూరు జిల్లా సర్పంచులు... డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. వైకాపా ప్రభుత్వం సర్పంచులకు నిధులు, విధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. సర్కారు వైఖరితో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని... కనీసం ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచులకు రావలసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు మా అకౌంట్లలో పడకుండా..పడ్ద డబ్బులని కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలియకుండా మా సంతకం లేకుండా దొంగతనంగా లాగేసుకుంది. దీని గ్రామంలో పారిశుద్ధ్యం పనులు, బల్బులు కానీ ఇంకా ఇతర పనులు చేసే పరిస్థితుల్లో మేము లేము. ఇదే విషయంపై అధికారులని ప్రశ్నిస్తే మీకు దిక్కున చోట చెప్పుకోండి అని సర్పంచులకు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ద్వారా మమ్మల్ని కాపాడాలని అంబేడ్కర్ కి, గాంధీ కోరుకున్న స్వరాజ్యం మళ్లీ రావాలని వారికి వినతి పత్రం ఇచ్చాము.-రాయపూడి వీరమల్లేశ్వరరావు, కోయవారిపాలెం సర్పంచి, గుంటూరు జిల్లా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details