ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెండింగ్​ జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అరెస్టు

By

Published : Jan 11, 2021, 4:51 PM IST

Updated : Jan 11, 2021, 7:39 PM IST

జీతాలు చెల్లించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా మందడంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

sanitary workers protest over salary's
జీతాలు పెంపుకై పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

పెండింగ్​ జీతాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. అరెస్టు

పెండింగ్​ జీతాలు చెల్లించాలని కోరుతూ.. గుంటూరు జిల్లా మందడంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరనస వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. తమ జీతాలు చెల్లించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు భీష్మించుకొని కూర్చున్నారు. అదనపు బలగాలను రప్పించి కార్మికులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

Last Updated : Jan 11, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details