సంగం డెయిరీ వార్షిక టర్నోవర్ 13 వందల కోట్లకు మించిందని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఈ ఘనత వెనుక కంపెనీ సిబ్బంది కృషి, డెయిరీ ఉత్పత్తుల పట్ల వినియోగదారులు చూపుతున్న ఆదరణే కారణమన్నారు. ఈ సందర్భంగా డెయిరీ పరిపాలన భవనంలోని బోర్డ్హాల్లో ఆయన కేక్ కట్ చేసి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మార్కెట్లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులను తయారు చేస్తూ ముందుకు సాగటం వల్లే డెయిరీ అభివృద్ది సాధ్యమైందన్నారు.
సంగం డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.1300 కోట్లు.. సిబ్బందిని అభినందించిన ఛైర్మన్ - సంగం డెయిరీ వార్షిక టర్నోవర్ న్యూస్
సంగం డెయిరీ సిబ్బంది కృషి, ఉత్పత్తుల పట్ల వినియోగదారుల ఆదరణ వల్ల డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.13 వందల కోట్లు దాటిందని ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మార్కెట్లో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులను తయారు చేస్తూ ముందుకు సాగటం వల్లే డెయిరీ అభివృద్ది సాధ్యమైందన్నారు.
ప్రస్తుతం 136 రకాల డెయిరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నా.. నాణ్యత విషయంలో శ్రద్ద చూపటం వల్లే మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుందని నరేంద్ర తెలిపారు. గతేడాది (2020-21) లో రూ. 1098.57 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండగా.. ఈ ఏడాది రెండు వందల కోట్లకు పైగా వృద్ది నమోదు చేసి 13 వందల కోట్ల మార్కును దాటిందన్నారు. గతంలో ఒక్క జిల్లాకు పరిమితమైన తమ ఉత్పత్తులను నేడు ఏడు జిల్లాలతోపాటు విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలలో విజయవంతంగా మార్కెట్ చేస్తున్నామని ధూళిపాళ్ల వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇకపై మాస్క్ తప్పనిసరి లేదా? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయి?