ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులు అన్యాయంగా నా భర్తను అదుపులోకి తీసుకున్నారు'

పోలీసులు అన్యాయంగా తన భర్తను తీసుకెళ్లారని రొంపిచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ దావులూరి లక్ష్మీ ఆరోపించారు. తన భర్త అంజయ్యకు ఏం జరిగినా పోలీసులు, నరసరావుపేట ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

By

Published : Feb 13, 2021, 4:25 AM IST

rompicharla market yard chairman laxmi
'పోలీసులు అన్యాయంగా నా భర్తను అదుపులోకి తీసుకున్నారు'

గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన దావులూరి అంజయ్యను నరసరావుపేట రెండో పట్టణ సీఐ, రొంపిచర్ల పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని రొంపిచర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ దావులూరి లక్ష్మీ ఆరోపించారు. గోగులపాడు సర్పంచి అభ్యర్థిగా తన భర్త మేనల్లుడు లక్ష్మీనారాయణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అతని ఎన్నికల ప్రచారంలో తన భర్త అంజయ్య పాల్గొన్నాడని... అక్కసుతో తన భర్తను గుర్తు తెలియని వాహనంలో పోలీసులు తీసుకువెళ్లారన్నారు.

అంజయ్యకు ఏమైనా జరిగితే పోలీసులు, నరసరావుపేట ఎమ్మెల్యే బాధ్యత వహించాలని దావులూరి లక్ష్మీ, అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రొంపిచర్ల పోలీసులను వివరణ కోరగా... ఎన్నికల ప్రచారం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ఇదీ చదవండి

పసిబిడ్డ ప్రాణం తీసిన తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష

ABOUT THE AUTHOR

...view details